వైట్ కాలర్ ఉద్యోగాల్లో హైదరాబాద్‌లో 23 శాతం గ్రోత్

భారత్‌లో White Collar ఉద్యోగ నియామకాలు గత ఏడాదితో పోలిస్తే 14 శాతం పెరిగాయి. Naukri Jobspeek Report ప్రకారం ఆటోమొబైల్ రంగంలో 19 శాతం, హెల్త్‌కేర్‌లో 16 శాతం, రిటైల్‌లో 15 శాతం గ్రోత్ నమోదైంది. ఫ్రెషర్ ఉద్యోగాల్లోనూ 15 శాతం పెరుగుదల కనిపించింది. మొత్తం Jobspeek Index గత ఆగస్టులో 2,664 నుంచి ఈసారి 3,028కి చేరింది. నగరాల వారీగా హైదరాబాద్‌లో అత్యధికంగా 23శాతం గ్రోత్ నమోదైంది.



