వెంకీ ‘AK47’ మాస్ టీజర్.. వచ్చేసింది!
విక్టరీ వెంకటేష్, త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబోలో వస్తున్న ‘ఆదర్శ కుటుంబం – AK47’ టీజర్ నెట్టింట హైప్ పెంచుతోంది. ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా కనిపిస్తూనే.. వెంకీ కామెడీ, త్రివిక్రమ్ పంచ్ డైలాగ్స్, యాక్షన్ సీన్స్‌తో టీజర్ అదిరిపోయింది. ఫ్యామిలీ దాచిన అసలు కథ ఏంటనే క్యూరియాసిటీని పెంచింది. శ్రీనిధి శెట్టి హీరోయిన్‌గా నటిస్తోంది. నారా రోహిత్, నివేదా పేతురాజ్, సత్య, రావు రమేష్, వెన్నెల కిషోర్ కీ రోల్స్‌లో కనిపించనున్నారు. థమన్ BGM హైప్‌ను మరింత పెంచింది. ఈ సినిమా అక్టోబర్ 2న థియేటర్లలోకి రానుంది.


