CJP ఎఫెక్ట్.. స్కూళ్లపై రాష్ట్రాల ప్రభుత్వాలు ఫోకస్!

కాక్రోచ్ జనతా పార్టీ ప్రారంభించిన 'స్కూల్ ఠీక్ కరో' క్యాంపెయిన్ రాష్ట్రాల్లో బలంగా ప్రభావం చూపుతోంది. రాజస్థాన్ ప్రభుత్వం స్కూళ్ల కోసం 12వేల 500 కోట్ల బడ్జెట్ ప్రకటించింది. ఉత్తరప్రదేశ్ 604 కోట్లను గవర్నమెంట్ స్కూళ్ల మెరుగుదలకు ఆమోదించింది. మహారాష్ట్ర “స్కూల్ చలో అభియాన్” ప్రారంభించి, ఆదివాసీ స్కూళ్లలో కొత్త ఆటస్థలాలు, బెడ్లు ఏర్పాటు చేసింది. హర్యానా 450 స్కూళ్ల అప్‌గ్రేడ్‌కు 400 కోట్లు కేటాయించింది. గ్రామాల్లోని ప్రభుత్వ స్కూళ్లలో సౌకర్యాల మెరుగుదలపై CJP క్యాంపెయిన్ ఫోకస్ పెట్టింది.

