BRS నాయకుల 'మాక్ అసెంబ్లీ'

TG : అసెంబ్లీ నుంచి సస్పెండ్ కావడంతో BRS నాయకులు తెలంగాణ భవన్‌లో 'మాక్ అసెంబ్లీ' నిర్వహించారు. ఇందులో ఎమ్మెల్యే మాణిక్ రావు స్పీకర్‌గా, తలసాని శ్రీనివాస్ యాదవ్ CMగా నటించారు. "100 రోజుల్లో హామీలు అన్నాం.. కానీ ఏ 100 రోజుల్లో అని చెప్పామా? 25 ఏళ్లలో ఎప్పుడో ఒకప్పుడు అమలు చేస్తాం" అంటూ తలసాని సెటైర్లు వేశారు. అసెంబ్లీలో తమ గొంతు నొక్కేస్తున్నారని ప్లకార్డులతో BRS సభ్యులు నిరసన తెలిపారు.



