← Back to news

184 సార్లు బ్లడ్ డొనేట్ చేసిన SI!

By sahani· 3 Aug 2026· Eenadu· haryana
184 సార్లు బ్లడ్ డొనేట్ చేసిన SI!

హర్యానాలో SI అశోక్ కుమార్ వర్మ రియల్ హీరో అనిపించుకుంటున్నారు. 1989 నుంచి ఇప్పటివరకు ఈయన 184 సార్లు బ్లడ్ డొనేషన్, 90 సార్లు ప్లేట్‌లెట్స్ డొనేట్ చేసి రికార్డ్ క్రియేట్ చేశారు. 599 బ్లడ్ క్యాంప్స్ పెట్టి ఏకంగా 63 వేల మంది ప్రాణాలను కాపాడారు. అంతేకాకుండా 'రోటీ బ్యాంక్' ద్వారా పేదలకు ఫుడ్ అందిస్తున్నారు. నార్కోటిక్స్ ఆఫీసర్‌గా 4,800 అవేర్‌నెస్ ప్రోగ్రామ్స్ ద్వారా లక్షలాది మందిని డ్రగ్స్‌కు దూరం చేశారు. అతని సేవలకి గుర్తింపుగా 2020లో రాష్ట్రపతి మెడల్‌తో పాటు రెండు గోల్డ్ మెడల్స్ అందుకున్నారు.

More in Motivational

ఒక్క నెగెటివ్ కామెంట్.. వంద ప్రశంసలపై ఎందుకు గెలుస్తుంది?
Motivational· 2d ago

ఒక్క నెగెటివ్ కామెంట్.. వంద ప్రశంసలపై ఎందుకు గెలుస్తుంది?

వందమంది మనల్ని మెచ్చుకున్నా.. ఒక్కరు “బాగా చేయలేదు” అంటే ఆ మాటే రోజంతా మన తలలో తిరుగుతుంది. ఇది మనలో ఏదో లోపం ఉందని కాదు.. మెదడు నెగెటివ్ విషయాలకు ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చేలా పనిచేయడమే కారణం. ప్రమాదాలు, విమర్శలు, తిరస్కరణలు గుర్తుపెట్టుకోవడం మనుగడకు ఉపయోగపడేది. అందుకే మంచి అనుభవాల కంటే చెడు మాటలు ఎక్కువగా గుర్తుండిపోతాయి. అయితే ప్రతి కామెంట్ నిజం కాదు. ఒక్కరి అభిప్రాయాన్ని మన విలువకు కొలమానంగా మార్చుకుంటే.. వంద నిజమైన ప్రశంసల విలువను మనమే తగ్గించినట్టే. అది కేవలం ఒక వ్యక్తి అభిప్రాయం మాత్రమే.