కొలెస్ట్రాల్ బాగున్నా.. గుండెకు ముప్పు?

రక్తంలో ఉండే లైపోప్రొటీన్(A) అనే కొవ్వు కణం ఎక్కువగా ఉన్నవారికి గుండె జబ్బులు, గుండెపోటు ముప్పు పెరగొచ్చని డాక్టర్లు చెబుతున్నారు. ఇది ఎక్కువగా తల్లిదండ్రుల నుంచి జన్యువుల ద్వారా వస్తుంది. సాధారణ కొలెస్ట్రాల్ పరీక్షలో స్థాయిలు బాగున్నా.. కొందరిలో లైపోప్రొటీన్(A) ఎక్కువగా ఉండొచ్చు. స్థాయి ఎక్కువగా ఉంటే LDL(Low-Density Lipoprotein) కొలెస్ట్రాల్, BP, షుగర్‌ను అదుపులో ఉంచుకోవడం ద్వారా గుండె ముప్పును తగ్గించుకోవచ్చు.



