← Back to news

“నేను బాగున్నా”.. నిజంగా బాగున్నామా?

By Nani Garikina· 5d ago
“నేను బాగున్నా”.. నిజంగా బాగున్నామా?

మనసులో ఏదో బాధగా ఉంటుంది.. కానీ ఎవరైనా “ఏమైంది?” అని అడిగితే మాత్రం వెంటనే “ఏం లేదు.. నేను బాగున్నా” అని చెప్పేస్తాం. అసలు ఎందుకు? మన బాధను బయటపెడితే ఎదుటివాళ్లు మనల్ని బలహీనంగా చూస్తారేమో, ఎక్కువగా ప్రశ్నిస్తారేమో అనే ఆలోచన మనల్ని ఆపొచ్చు. కొన్నిసార్లు మన సమస్యను ఎలా చెప్పాలో తెలియక కూడా మౌనంగా ఉండిపోతాం. కానీ ఇలా బాధను ఎప్పుడూ మనలోనే దాచుకోవడం వల్ల ఒత్తిడి, ఒంటరితనం మరింత పెరగొచ్చు. అందుకే “నేను బాగున్నా” అనేది కొన్నిసార్లు నిజమైన సమాధానం కాదు.. మనసు దాచుకున్న మాట కావచ్చు.

More in Motivational

ఒక్క నెగెటివ్ కామెంట్.. వంద ప్రశంసలపై ఎందుకు గెలుస్తుంది?
Motivational· 2d ago

ఒక్క నెగెటివ్ కామెంట్.. వంద ప్రశంసలపై ఎందుకు గెలుస్తుంది?

వందమంది మనల్ని మెచ్చుకున్నా.. ఒక్కరు “బాగా చేయలేదు” అంటే ఆ మాటే రోజంతా మన తలలో తిరుగుతుంది. ఇది మనలో ఏదో లోపం ఉందని కాదు.. మెదడు నెగెటివ్ విషయాలకు ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చేలా పనిచేయడమే కారణం. ప్రమాదాలు, విమర్శలు, తిరస్కరణలు గుర్తుపెట్టుకోవడం మనుగడకు ఉపయోగపడేది. అందుకే మంచి అనుభవాల కంటే చెడు మాటలు ఎక్కువగా గుర్తుండిపోతాయి. అయితే ప్రతి కామెంట్ నిజం కాదు. ఒక్కరి అభిప్రాయాన్ని మన విలువకు కొలమానంగా మార్చుకుంటే.. వంద నిజమైన ప్రశంసల విలువను మనమే తగ్గించినట్టే. అది కేవలం ఒక వ్యక్తి అభిప్రాయం మాత్రమే.