'ఆపరేషన్ సింధూర్' అమరవీరుల పేర్లు విడుదల!

'ఆపరేషన్ సింధూర్' పోరాటంలో మరణించిన ఆరుగురు భారత సైనికుల పేర్లను ప్రభుత్వం అధికారికంగా తొలిసారి విడుదల చేసింది. దేశ రక్షణ కోసం వారు చేసిన అత్యున్నత త్యాగానికి గుర్తుగా ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ వీర జవాన్ల పేర్లను దేశ రాజధాని ఢిల్లీలోని నేషనల్ వార్ మెమోరియల్ (జాతీయ యుద్ధ స్మారకం) వద్ద శిలాఫలకాలపై శాశ్వతంగా లిఖించనున్నారు. అమరులైన ఆ హీరోలు ఎవరంటే -గన్‌మ్యాన్ దేవేంద్ర సింగ్ , నాయక్ సుఖ్విందర్ సింగ్, లాన్స్ నాయక్ గురుతేజ్ సింగ్, సిపాయి హర్‌ప్రీత్ సింగ్, రైఫిల్‌మ్యాన్ కుల్దీప్ సింగ్,సిపాయి మన్‌ప్రీత్ సింగ్. వారి త్యాగాన్ని స్మరిస్తూస్మరిస్తూ దేశం మొత్తం వారికి ఘన నివాళులు అర్పిస్తోంది.



