అమ్మతనం కోసం కృతి సనన్ ముందు చూపు !

బాలీవుడ్ స్టార్ బ్యూటీ, జాతీయ అవార్డు గ్రహీత కృతి సనన్ తన వ్యక్తిగత జీవితానికి సంబంధించి ఒక సంచలన విషయాన్ని వెల్లడించారు. తాను కొన్ని సంవత్సరాల క్రితమే తన అండాలను భద్రపరుచుకున్నట్లు (Egg Freezing) తొలిసారిగా బహిరంగంగా ప్రకటించారు. ‘హ్యూమన్స్ ఆఫ్ బాంబే’కి ఇచ్చిన ఒక ప్రత్యేక ఇంటర్వ్యూలో ఆమె ఈ ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. తనకు ఉత్తమ నటిగా జాతీయ అవార్డును తెచ్చిపెట్టిన ‘మిమి’ (సరోగసీ నేపథ్యంలో సాగే చిత్రం) సినిమా ప్రిపరేషన్ సమయంలోనే ఈ ప్రక్రియను పూర్తి చేసినట్లు కృతి తెలిపారు.



