← Back to news

చికిత్స కోసం హాస్పటల్‌కి వెళ్తే.. పిల్లలకు HIV!

By Anusha· 9h ago· Indiatimes
చికిత్స కోసం హాస్పటల్‌కి వెళ్తే.. పిల్లలకు HIV!

పాకిస్థాన్‌లో చిన్న అనారోగ్యంతో హాస్పిటల్‌కి వెళ్లిన కొందరు పిల్లలకు HIV ఉన్నట్లు తేలడం ఆందోళన కలిగిస్తోంది. కరాచీలోని కుల్సూమ్ బై వలికా హాస్పటల్‌లో చికిత్స పొందిన పిల్లల్లో ఈ కేసులు బయటపడ్డాయి. ఇంజెక్షన్లు, డ్రిప్‌ల కోసం ఉపయోగించిన సూదులు, సిరంజీలను మళ్లీ వాడటం వల్లే HIV సోకిందని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. ఈ కేసుల్లో కనీసం ఆరుగురు పిల్లలు మృతి చెందినట్లు నివేదికలు చెబుతున్నాయి. HIV హాస్పిటల్‌ నుంచే సోకిందని ఇంకా అధికారికంగా నిర్ధారణ కాలేదు.

More in International