బిహార్‌లో యువతికి వేధింపులు.. నిందితుల అరెస్ట్
బిహార్ రాష్ట్రంలో జుమాయి మరువకముందే మరో ఘటన కలకలం రేపింది. సమస్తిపూర్ కర్పూరీగ్రామ్‌లోని జగత్‌సింగ్‌పూర్ బండ్ బైపాస్ రోడ్డుపై ఓ యువతిని కొందరు యువకులు అడ్డుకుని వేధించారు. ఆమె చేయి పట్టుకుని అసభ్యంగా ప్రవర్తించారు. 56 సెకన్ల ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వీడియో ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేపట్టి నలుగురిని అరెస్ట్ చేశారు.


