బిగ్ స్క్రీన్ కల: నటుడు భాను స్టేజ్‌పై అలా ఎందుకు చేశాడు?
తన్ను తాను బిగ్ స్క్రీన్‌పై చూసుకోవడం ఒక కల అని నటుడు భాను ఎమోషనల్ అయ్యారు. బిక్షు డైరక్షన్ లో అన్ను, వాసవి గణేష్ జంటగా నటించిన 'హుషార్ పిట్టలు' మూవీలో ఆయన కీ రోల్ చేశారు. ఆగస్టు 15న ఈ సినిమా రిలీజ్ కానుండగా, రీసెంట్‌గా జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో భాను మాట్లాడుతూ.. ఇండస్ట్రీలోకి రావడానికి 8 ఏళ్లు స్ట్రగుల్ అయ్యానని చెప్పారు. ఇది కలనా, నిజమా అంటూ స్టేజ్ మీదే పదే పదే చెంపలు కొట్టుకోవడంతో అందరూ షాక్ అయ్యారు.



