ఈ ఆర్టిస్టుల ఉద్యోగాలు ఊడినట్లేనా?
పెళ్లిళ్లు, పండుగల్లో డిమాండ్ ఉన్న మెహందీ ఆర్టిస్టుల జాబ్స్‌కి ఆటోమేషన్ సవాల్‌గా మారింది. హ్యాండ్ కింద పెడితే చాలు పర్ఫెక్ట్‌గా డిజైన్ వేసే మెహందీ మెషీన్ వీడియోను బిజినెస్‌మ్యాన్ హర్ష్ గోయెంకా ‘X’ లో షేర్ చేశారు. "మరికొన్ని జాబ్స్ ఊడినట్లే" అని ఆయన చేసిన పోస్ట్ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు రకరకాలుగా రెస్పాండ్ అవుతున్నారు. మెషీన్లు ఎంత స్పీడ్‌గా ఉన్నా చేతితో వేసే మెహందీ అందాన్ని, ఆ హ్యూమన్ టచ్‌ను రీప్లేస్ చేయలేవని కామెంట్స్ చేస్తున్నారు.


