GENZని వెంటాడుతున్న ఒంటరితనం

సొషల్ యాంగ్జయిటీ, ఒంటరితనం నేటి యూత్‌లో ఎక్కువగా పెరుగుతున్న ప్రాబ్లం. జపాన్‌లో ‘హెకికొమోరి’ కారణంగా లక్షలాది మంది సమాజానికి దూరంగా ఉంటున్నట్లు రిపోర్ట్స్ చెబుతున్నాయి. సౌత్ కొరియా, అమెరికా, బ్రిటన్‌లోనూ ఇదే పరిస్థితి. భారత్‌లోనూ ఐటీ ఉద్యోగులు, యువతలో ‘ఆఫీస్ ఫోబియా’, సొషల్ యాంగ్జయిటీ పెరుగుతున్నట్లు నిపుణులు చెబుతున్నారు. ఎక్కువ స్క్రీన్ టైమ్, సోషల్ మీడియా ప్రభావం కారణాలుగా చెప్తున్నారు. యువతను ఇతరులతో కలిసేలా ప్రోత్సహించడంతోపాటు కౌన్సెలింగ్, మానసిక ఆరోగ్యంపై అవగాహన పెంచాల్సిన అవసరం ఉంది.



