Gen Zకి AI బెస్ట్ ఫ్రెండ్..!

భారత్లోని Gen Z యువతలో AI వాడకం చాలా పెరిగింది. Deloitte 2026 సర్వే ప్రకారం 93% Gen Z యూత్.. తమ ఉద్యోగాల్లో రోజువారీగా AIని ఉపయోగిస్తున్నారు. చదువు, పని, కెరీర్ గురించి తెలుసుకోవడం, పని ఒత్తిడిని తగ్గించుకోవడం వంటి వాటికి AIని వాడుతున్నారు. 85% మంది తమ పని విషయంలో AI ఉపయోగించడంపై నమ్మకంగా ఉన్నారు. అంటే Gen Zకి AI కేవలం ట్రెండ్ కాదు.. రోజువారీ పని టూల్గా, ఫ్రెండులా మారుతోంది.



