రేవంత్ హైబ్రిడ్ నమూనా ఇదే

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి హైబ్రిడ్ నమూనా విధానంలో రెండు రకాలుగా ఎలా లోక్ సభ సీట్లు పెంచాలో చెప్పారు. హైబ్రిడ్ నమూనా 1 : దేశంలో పెంచాలనుకుంటున్న సీట్లలో 50% ఆయా రాష్ట్రాల జీడీపీ ఆధారంగా మరో 50% ఆ రాష్ట్ర ఆర్థిక పనితీరు, జనాభా ఆధారంగా పెంచాలి. జీడీపీ వృద్ధికి 70% GDP per capitaకి 15%, తలసరి ఆదాయానికి 15% వెయిటేజీ ఇవ్వాలి. హైబ్రిడ్ నమూనా 2 : ఈ నమూనా ప్రకారం 40శాతం జనాభా, 40 శాతం ఆర్థిక పనితీరు, 20శాతం సమాఖ్య స్ఫూర్తిని పరిగణనలోకి తీసుకొని సీట్లను పెంచాలి. అప్పుడే పార్లమెంట్ లో ఏ ప్రాంతానికి ఆధిపత్యం ఉండదు. జనాభాని నియంత్రించిన రాష్ట్రాలకు న్యాయం జరుగుతుంది.



