రైలులో ఫోన్ స్పీకర్‌లో పాటలు, వీడియోలు చూస్తున్నారా?

రైలు ప్రయాణంలో ఫోన్‌లో పాటలు, వీడియోలు స్పీకర్‌లో పెట్టి ఇతరులకు ఇబ్బంది కలిగిస్తే జరిమానా తప్పదని దక్షిణ రైల్వే అధికారులు వెల్లడించారు. ఈ రూల్స్ ప్రకారం ₹1,000 జరిమానా విధించడంతో పాటు రైల్వే ప్రాంగణం నుంచి తొలగించవచ్చని, అయినా వినకపోతే ఆరు నెలల వరకు జైలు శిక్ష, ₹.5,000 వరకు జరిమానా పడే అవకాశం ఉందని తెలిపారు. ప్రయాణికులకు ఇబ్బంది కలిగించకుండా ఫోన్‌ను హెడ్‌ఫోన్స్‌తో ఉపయోగించడం మంచిదని సూచిస్తున్నారు.



