బాలల భద్రతకు మెటా AI టూల్స్

బాలలపై లైంగిక దోపిడీకి సంబంధించిన కంటెంట్‌ను అడ్డుకునేందుకు కొత్త AI టూల్స్‌ను తీసుకొచ్చినట్లు మెటా తెలిపింది. 2026 జనవరి నుంచి జూన్ వరకు భారత్‌లో ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌లో 53 లక్షల కంటెంట్‌పై చర్యలు తీసుకున్నట్లు చెప్పింది. ఇందులో 98 శాతానికి పైగా కంటెంట్‌ను యూజర్లు కంప్లయింట్ చేయకముందే గుర్తించినట్లు వెల్లడించింది. అనుమానాస్పద ప్రకటనలు ఎక్కడికి తీసుకెళ్తున్నాయో AIతో చెక్ చేస్తున్నట్లు తెలిపింది. గతంలో గుర్తించని కంటెంట్‌ను కనుగొనేందుకు కొత్త AI సిస్టమ్స్‌ను ఉపయోగిస్తున్నట్లు చెప్పింది..



