← Back to news

సీఎం రేవంత్ నన్ను అవమానిస్తున్నారు: సురేఖ

By Vishi· 5h ago
సీఎం రేవంత్ నన్ను అవమానిస్తున్నారు: సురేఖ

TG: సీఎం రేవంత్ రెడ్డి తనను అవమానిస్తున్నారని ఆరోపిస్తూ మంత్రి కొండా సురేఖ కాంగ్రెస్ హైకమాండ్‌కు కంప్లైంట్ చేశారు. ఆగస్టు 22న సోనియా గాంధీ, కేసీ వేణుగోపాల్‌కు, ఆగస్టు 23న మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ, ప్రియాంకా గాంధీ, మీనాక్షి నటరాజన్‌కు రాసిన పది పేజీల లెటర్‌ను మీడియాకు విడుదల చేశారు. రేవంత్ రెడ్డి తన శాఖల్లో తన నిర్ణయాధికారాన్ని తగ్గించి నేరుగా ఆర్డర్స్ ఇస్తున్నారని తెలిపారు. తన మాజీ ఓఎస్డీని తొలగించి, అతణ్ని అరెస్టు చేసేందుకు తన ఇంటికి పోలీసులను పంపి మంత్రి హోదాను అవమానించారన్నారు.

More in TG