🌿ఆదివాసీల సంస్కృతికి సెల్యూట్..!

ప్రతి ఏడాది ఆగస్టు 9న ప్రపంచ ఆదివాసీ దినోత్సవం జరుపుకుంటారు. అడవులు, ప్రకృతిని కాపాడుతూ తరతరాలుగా తమ ప్రత్యేక సంస్కృతి, సంప్రదాయాలు, కళలు, భాషలను ఆదివాసీలు నిలబెట్టుకుంటున్నారు. వారి జీవన విధానం, హక్కులు, అభివృద్ధి గురించి ప్రజల్లో అవగాహన కల్పించడమే ఈ రోజు ముఖ్య ఉద్దేశం. ఆదివాసీ సంస్కృతిని గౌరవిస్తూ, వారి హక్కులను కాపాడటం మనందరి బాధ్యత. 🌿🤝



