ఫ్రాన్స్‌లో అరాచకం.. షాపుల లూటీ
ఫ్రాన్స్ తగలబడిపోతోంది. షాపులపై ఎగబడి లూటీ చేస్తున్నారు. ఎక్కడికక్కడ విధ్వంసం కనిపిస్తోంది. యువత, విద్యార్థులు రోడ్లపై రచ్చ చేస్తున్నారు. దీనంతటికీ కారణం ధరల పెరుగుదల, విద్యా ఖర్చులు విపరీతంగా పెరగడం, నిరుద్యోగం, ఆర్థిక అసమానతలు. ఎన్నాళ్లిలా అంటూ యువత భగ్గుమంటున్నారు. రాజధాని ప్యారిస్‌లో భారీ షాపుల్ని కూడా దోపిడీ చేస్తున్నారు. పరిస్థితి పూర్తిగా కంట్రోల్ తప్పినట్లే కనిపిస్తోంది. ప్రజా అసంతృప్తి ఆ స్థాయిలో ఉంది.


