వెనిజులాలో వరుస భూ కంపాలు- 164 మంది మృతి!

వెనిజులాను వెంట వెంటనే కొన్ని సెకన్ల పాటు కుదిపేసిన రెండు భూ కంపాలు ఆ ప్రాంతాన్ని స్మశానం గా మార్చేశాయి. ముఖ్యంగా తీర ప్రాంతమైన లాగువైరా ఇప్పుడు శవాల కుప్పగా మారిపోయింది. ఎటుచూసినా కుప్పకూలిన భవనాలే. టాప్ హోటల్స్ సైతం నేల కూలాయి. మకుటో ఏరియాలో టాప్ హోటెల్, టూరిస్టులకు పరిచయమైన హోటల్ అడ్వర్ట్ నామ రూపాలు లేకుండా ధ్వంసమైంది.కేవలం హోటల్ బేస్ మెంట్ మాత్రం మిగిలింది. పెద్ద సంఖ్యలో ప్రాణ నష్టం జరిగి ఉండొచ్చు.. ఇప్పటి వరకూ 164 మంది చనిపోయినట్లు రికార్డులు చెబుతున్నాయి. భూకంపం రావొచ్చని ముందే గూగుల్ అలర్ట్ చేసింది.



