సూర్యాపేటలో రాంరెడ్డి దామోదర్ రెడ్డి విగ్రహావిష్కరణ

సూర్యాపేట జిల్లా కేంద్రంలోని పబ్లిక్ క్లబ్ ఫంక్షన్ హాల్‌లో మాజీ మంత్రి, మాజీ ఎమ్మెల్యే రాంరెడ్డి దామోదర్ రెడ్డి విగ్రహావిష్కరణ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, ఆయన అభిమానులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ఆత్మీయ నేత విగ్రహం ముందు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కొప్పుల వేణారెడ్డి భావోద్వేగానికి గురయ్యారు. జిల్లా గ్రంథాలయ చైర్మన్ వంగవీటి రామారావు కూడా విగ్రహావిష్కరణలో పాల్గొన్నారు.



