దుగ్గిరాలలో జనసేన నేతల సమావేశం

గుంటూరు జిల్లా దుగ్గిరాల మండలంలో జనసేన పార్టీ స్థానిక ఎన్నికల సమన్వయకర్తల మీటింగ్ ఆదివారం జరిగింది. మండల పార్టీ అధ్యక్షుడు పసుపులేటి శ్రీనివాసరావు ఇంట్లో జరిగిన ఈ మీటింగ్ తర్వాత నాయకులు ఈమని, చింతలపూడి, పెదకొండూరు గ్రామాల్లో పర్యటించారు. ఈ కార్యక్రమంలో గంజి చిరంజీవి, మునగపాటి మారుతీరావు, సవ్వాకుల కోటేష్‌బాబు, మాజీ వైస్ ఎంపీపీ పసుపులేటి సాయి చైతన్య, మార్కెట్ యార్డు వైస్ చైర్మన్ కిషోర్‌తో పాటు గ్రామ నాయకులు, పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.




