నటి కలర్స్ స్వాతి రెండో పెళ్లి !

తెలుగు నటి 'కలర్స్' స్వాతి (స్వాతి రెడ్డి) దర్శకుడు శ్రీకాంత్ నాగోతిని ఇవాళ రెండవ వివాహం చేసుకున్నారు. అత్యంత సన్నిహితులు, కుటుంబ సభ్యుల మధ్య సైలెంట్‌గా ఈ పెళ్లి జరిగినట్లుగా తెలుస్తోంది. స్వాతి గతంలో శ్రీకాంత్ నాగోతి దర్శకత్వంలో వచ్చిన 'మంత్ ఆఫ్ మధు' అనే సినిమాలో నటించారు. ఆ పరిచయంతోనే వీరిద్దరి మధ్య సఖ్యత పెరిగింది. ఇరు కుటుంబాలు అంగీకరించి వీరికి పెళ్లి జరిపించారు. స్వాతి మొదట్లో వికాస్ వాసు అనే పైలట్ ను పెళ్లి చేసుకున్నారు. అయితే ఆ బంధం ఎక్కువ కాలం నిలవలేదు. విడాకులు తీసుకున్నారు.



