సినిమాలు వేరు.. నిజ జీవితం వేరు: పవన్ కల్యాణ్

AP: డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పోలవరం జిల్లా రంపచోడవరంలో జరిగిన సభలో మాట్లాడారు. సినిమాల్లో బ్యాక్‌గ్రౌండ్ పాటతో కొన్ని నిమిషాల్లో అద్భుతాలు చూపించవచ్చని, కానీ నిజ జీవితంలో పనులు పూర్తి చేయాలంటే ఏళ్ల తరబడి కష్టపడాలని అన్నారు. ప్రజలకు మంచి ఆరోగ్యం, విద్య అందించడం ముఖ్యమని చెప్పారు. గ్రామాల్లో తక్కువ కుటుంబాలు ఉన్నా, ఓట్లు వస్తాయా లేదా అని చూడకుండా రోడ్లు వేయాలని తెలిపారు. ఒక రోడ్డు వల్ల ఇద్దరి జీవితాలు మారినా అది మంచి పనేనని ఆయన అభిప్రాయపడ్డారు.



