పిల్లల తొలి రెండేళ్లలో ఈ మిస్టేక్ చేయొద్దు!

పిల్లల తొలి రెండేళ్లలోనే మెదడు, శరీరం వేగంగా ఎదుగుతాయి. అందుకే ఈ టైమ్‌లో పోషకాహారం విషయంలో కేర్‌ఫుల్‌గా ఉండాలి. 6 నెలల వరకు తల్లిపాలు ఇచ్చి.. ఏడో నెల నుంచి ఇతర ఆహారం ఇవ్వాలని ఆథర్ Maureen M. Black సూచిస్తున్నారు. పోషకాహారం సరిగా అందకపోతే ఎదుగుదల మందగించడంతో పాటు మెమరీ పవర్, నేర్చుకునే సామర్థ్యం, ఐక్యూపైనా ప్రభావం పడొచ్చు. ముఖ్యంగా అయోడిన్, ఐరన్, విటమిన్ B12 లోపాలు పిల్లల అభివృద్ధిపై ప్రభావం చూపుతాయని బ్లాక్ తెలిపారు.



