← Back to news

ఆరు తరాల ఉమ్మడి కుటుంబం.. 83 మందికి ఒకే వంటిల్లు!

By Mahesh· 16 Aug 2026· Youtube· అనంతపురం
ఆరు తరాల ఉమ్మడి కుటుంబం.. 83 మందికి ఒకే వంటిల్లు!

AP: అనంతపురం జిల్లా కుర్లపల్లిలో ఆరు తరాలుగా కొనసాగుతున్న ఓ భారీ ఉమ్మడి కుటుంబం ఆసక్తికరంగా మారింది. ఈ కుటుంబంలో ఏకంగా 83 మంది ఉన్నారు. అందరికీ ఒకే వంటింట్లో కట్టెల పొయ్యిపైనే వంట చేస్తారు. రోజుకు 50 కిలోల బియ్యం అవసరం అవుతుంది. ఆదివారం నాన్‌వెజ్‌ వండితే ఒక పొట్టేలు, 10 కిలోల చికెన్‌ వండుతారు. సాయంత్రం బజ్జీలు చేయాలంటే 15 కిలోల పిండి అవసరమవుతుందని కుటుంబ సభ్యులు తెలిపారు. <a href="https://www.youtube.com/watch?v=Av8N3HDPrXw">83 మంది ఒకే కుటుంబంగా,</a> ఒకే ఇంట్లో కలిసి జీవించడం నిజంగా ఆశ్చర్యమే.

More in Parenting