← Back to news

పిల్లల ఆన్‌లైన్ సేఫ్టీపై సుప్రీం కీలక కామెంట్స్

By Mahesh· 3h ago· ANI
పిల్లల ఆన్‌లైన్ సేఫ్టీపై సుప్రీం కీలక కామెంట్స్

పిల్లలు సోషల్ మీడియా వాడకంపై సుప్రీంకోర్టు కీలక కామెంట్స్ చేసింది. పిల్లలు డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లను ఈజీగా యాక్సెస్ చేస్తుండటంతో.. వారికి సేఫ్టీ గైడ్‌లైన్స్ తప్పనిసరిగా ఉండాలని తెలిపింది. ఆన్‌లైన్ వేధింపుల నుంచి మైనర్లను ఎలా కాపాడతారో చెప్పాలని కేంద్రానికి నోటీసులు ఇచ్చింది. జస్ట్ రైట్స్ ఫర్ చిల్డ్రన్ అలయన్స్ పిటిషన్‌పై విచారణలో ఈ కామెంట్స్ చేసింది. ఆటో కంటెంట్ ఫిల్టర్లు, ఏజ్ వెరిఫికేషన్ ఉండాలని పిటిషనర్లు కోరారు. అల్గారిథమ్స్ పిల్లలకు ఏజ్‌కు మించిన కంటెంట్ చూపిస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు.

More in Current Affairs

CJP ప్రొటెస్టులో పాల్గొన్నాడని నోటీసులు.. సుప్రీం సీరియస్!
Current Affairs· 1d ago

CJP ప్రొటెస్టులో పాల్గొన్నాడని నోటీసులు.. సుప్రీం సీరియస్!

గ్రేటర్ నోయిడాలోని లా స్టూడెంట్ అక్షత్ త్రిపాఠీకి మేజిస్ట్రేట్ రూ.5 లక్షల పర్సనల్ బాండ్‌పై నోటీసు ఇచ్చారు. జులైలో ‘క్రాక్‌రోచ్ జనతా పార్టీ’ (CJP) నిరసనలో పాల్గొన్నాడని ఆయనపై ఆరోపణలు వచ్చాయి. అయితే స్టూడెంట్స్‌పై ఎలాంటి యాక్షన్స్ తీసుకోవద్దని సుప్రీంకోర్టు ఇప్పటికే క్లారిటీ ఇచ్చింది. దీంతో 'నోటీసులు ఇవ్వడానికి మేజిస్ట్రేట్‌కు ఎంత ధైర్యం' ఎలా ఇచ్చారంటూ CJI సూర్యకాంత్ ప్రశ్నించారు. నోటీసును తర్వాత వెనక్కి తీసుకున్నా, దీనిపై జిల్లా మేజిస్ట్రేట్ నుంచి ఎక్స్‌ప్లనేషన్ కోరాలని కోర్టు తెలిపింది.