కులతత్వం అంతమైతే నో రిజర్వేషన్స్

దేశంలో కులతత్వాన్ని రద్దు చేస్తే తాము రిజర్వేషన్లు వదులుకుంటామని కేంద్రమంత్రి, RPI చీఫ్ రాందాస్ అఠావలె అన్నారు. రిజర్వేషన్లను వ్యతిరేకించడం రాజ్యాంగ విరుద్ధమని, వెనుకబడిన వర్గాల కోసమే వాటిని తెచ్చారని చెప్పారు. అంటరానితనం నిషేధించినా దళితులు, గిరిజనులపై దౌర్జన్యాలు జరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. గార్భా నృత్యాల్లోకి ముస్లింలను అనుమతించవద్దన్న VHP పిలుపును తప్పుపట్టారు. రాజ్యాంగం ప్రకారం ఏ మతపరమైన ఈవెంట్స్‌లోనైనా భారతీయులందరూ పాల్గొనవచ్చని తేల్చిచెప్పారు.



