← Back to news

సముద్రంపై రైలు.. పైకి లేచే బ్రిడ్జ్ ఇదే!

By Mahesh· 7 Oct 2026· Tamilnadu
సముద్రంపై రైలు.. పైకి లేచే బ్రిడ్జ్ ఇదే!

తమిళనాడులోని రామేశ్వరంలో ఉన్న కొత్త పాంబన్ బ్రిడ్జ్ ఇప్పుడు అందరి అటెన్షన్‌ను ఆకర్షిస్తోంది. 2 కిలోమీటర్ల పొడవున్న ఈ బ్రిడ్జ్ దేశంలోనే తొలి వెర్టికల్ లిఫ్ట్ రైల్వే సీ బ్రిడ్జ్. పెద్ద షిప్‌లు వెళ్లాల్సినప్పుడు బ్రిడ్జ్ మధ్యలోని 72.5 మీటర్ల లిఫ్ట్ స్పాన్ 17 మీటర్ల వరకు పైకి లేస్తుంది. షిప్ వెళ్లిన తర్వాత మళ్లీ కిందకు వచ్చి రైళ్లకు రూట్ క్లియర్ చేస్తుంది. రైలు జర్నీలో రెండు వైపులా సముద్రం, కింద అలలు కనిపించడం ఈ రూట్‌ను స్పెషల్‌గా మారుస్తోంది.

More in Technology