← Back to news

జుహూ బీచ్‌లో బతుకమ్మ సందడి!

By M.Malaji· 1h ago· Nizamabad, Nizamabad South, Nizamabad
జుహూ బీచ్‌లో బతుకమ్మ సందడి!

మహారాష్ట్ర ముంబైలో అంధేరీ గంగపుత్ర సంఘం ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు ఘనంగా జరిగాయి. సంఘం అధ్యక్షులు మంగిలిపెల్లి శ్రీనివాస్ ఈ ఈవెంట్‌కు నేతృత్వం వహించారు. ఆదివారం సాయంత్రం పశ్చిమ అంధేరీ డొంగ్రి ఏరియా నుంచి మహిళలు బతుకమ్మలను నెత్తిపై పెట్టుకొని ప్రఖ్యాత జుహూ బీచ్ వరకు ఊరేగింపుగా వెళ్లి అక్కడ బతుకమ్మ ఆడారు. ఈ ఉత్సవంలో మంగిలిపెల్లి రేణుకదేవి, అంబటి నాగమ్మ, బాలగొని ఇందిరమ్మ, కదిరి కొమురమ్మ, ఇటుకల మహేశ్వరి, మైసా అనిత, సింగర్ కలమ, దేశబోయిన సువర్ణ, బెర్గల లక్ష్మి, పూస బాలమణి పాల్గొన్నారు.

More in Local