ప్రజావాణి దరఖాస్తులను పరిష్కరించాలి

సూర్యాపేట కలెక్టరేట్‌లో జరిగిన ప్రజావాణి కార్యక్రమానికి 25 దరఖాస్తులు వచ్చాయి. ప్రజల సమస్యలను త్వరగా పరిష్కరించడంపై అధికారులు ఫోకస్ పెట్టాలని జిల్లా అదనపు కలెక్టర్ B. హరిసింగ్ సూచించారు. పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని చెప్పారు. వచ్చిన దరఖాస్తుల్లో భూ సమస్యలకు 12, రెవెన్యూకు 1, డీపీఓకు 2, డీఈఓకు 2 ఉండగా, మరో 8 దరఖాస్తులు ఇతర శాఖలకు సంబంధించినవి..





