త్రి ఇడియట్స్ కి సీక్వెల్ వస్తోందా?

బాలీవుడ్ కల్ట్ క్లాసిక్ ‘3 ఇడియట్స్’ సినిమా వచ్చి దాదాపు 20 ఏళ్లు కావస్తున్నా, ఇప్పటికీ ఆ క్రేజ్ తగ్గలేదు. తాజాగా దర్శకుడు రాజ్‌కుమార్ హిరాణీ ఈ చిత్ర సీక్వెల్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. "ఆ ముగ్గురు మిత్రుల (ఆమిర్, మాధవన్, శర్మన్ జోషి) పాత్రలు 20 ఏళ్ల తర్వాత ఎలా ఉంటాయనే కోణంలో కథను డెవలప్ చేయడానికి ప్రయత్నిస్తున్నాం. సరైన కథ కుదిరితేనే ఈ సీక్వెల్ పట్టాలెక్కుతుంది" అని ఆయన స్పష్టం చేశారు. సో త్రీ ఇడియట్స్ సీక్వెల్ రెడీ అవుతోందన్నమాట



