TIMSలో ఉద్యోగాలు.. నెలకు రూ.19,500 జీతం!

TG: సనత్‌నగర్ TIMS హాస్పిటల్‌లో అవుట్‌సోర్సింగ్ విధానంలో ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు తీసుకుంటున్నట్లు జిల్లా కోఆర్డినేటర్ డా. సాయినారాయణ గౌడ్ తెలిపారు. గ్రాడ్యుయేషన్, DCA అర్హత ఉన్నవారికి నెలకు రూ.19,500 వేతనం అందించనున్నారు. ఇంట్రెస్ట్ ఉన్నవారు ఈ నెల 21న ఉ. 11 గం. నుంచి సా. 5 గంటల వరకు సికింద్రాబాద్ ప్యాట్నీ దగ్గరలోని NTPC బిల్డింగ్ 4th ఫ్లోర్ DMHO ఆఫీసులో Interviewలకు హాజరుకావాలన్నారు. ఎంపిక జాబితాను ఈ నెల 31 నుంచి సెప్టెంబర్ 1 వరకు ప్రదర్శించనున్నట్లు తెలిపారు.



