← Back to news

CECపై ముంబైలో అక్టోబర్ 4న భారీ నిరసన మార్చ్

By Vishi· 5h ago
CECపై ముంబైలో అక్టోబర్ 4న భారీ నిరసన మార్చ్

CEC జ్ఞానేశ్ కుమార్‌పై మహారాష్ట్ర నవనిర్మాణ్ సేన, శివసేన కలిసి అక్టోబర్ 4న ముంబైలో భారీ నిరసన మార్చ్ చేపట్టనుంది. ఈ మార్చ్‌కు రాజ్ ఠాక్రే, ఉద్ధవ్ ఠాక్రే నాయకత్వం వహిస్తారు. ఎన్నికల సంఘం బీజేపీకి అనుకూలంగా మారిందని వారు ఆరోపించారు. ‘SIR’ పేరుతో ఓటర్లను మోసం చేస్తున్నారని అన్నారు. దీనికి వ్యతిరేకంగా ఈ నిరసన చేపడుతున్నామన్నారు. ఇది కేవలం రెండు పార్టీలది కాదని, ప్రజల మార్చ్ అని తెలిపారు. అన్ని పార్టీలు ఇందులో పాల్గొనాలని పిలుపునిచ్చారు.

More in National