మూడో టీ20లో గెలుపెవరిది?

భారత్, వెస్టిండీస్ మధ్య ఇవాళ ఇండోర్‌లో మూడో T20 జరగనుంది. ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో ఇరు జట్లు చెరో విజయం సాధించడంతో పోరు ఆసక్తికరంగా మారింది. హోల్కర్ స్టేడియం బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉండటంతో భారీ స్కోర్లు నమోదయ్యే ఛాన్స్ ఉంది. విండీస్ కెప్టెన్ షాయ్ హోప్, రూథర్‌ఫోర్డ్ ఫామ్ భారత్‌కు సవాల్‌గా మారింది. వారిని త్వరగా ఔట్ చేయడంపై భారత బౌలర్లు దృష్టి పెట్టనున్నారు. గత మ్యాచ్‌లో ఫీల్డింగ్ తప్పిదాలను సరిదిద్దుకుని గెలవాలని TeamIndia చూస్తోంది. మ్యాచ్ రాత్రి 7 గంటలకు ప్రారంభం కానుంది.



