← Back to news

భారత్–వెస్టిండీస్ మ్యాచ్‌కు భారీ భద్రత

By Sharmila· 1d ago
భారత్–వెస్టిండీస్ మ్యాచ్‌కు భారీ భద్రత

TG: హైదరాబాద్‌లోని ఉప్పల్ స్టేడియంలో రేపు జరగుతున్న భారత్, వెస్టిండీస్ మధ్య టీ20 మ్యాచ్ కోసం అన్నీ ఏర్పాట్లు చేశామని మల్కాజిగిరి CP సుమతి తెలిపారు. ఈ మ్యాచ్ కోసం 2,200 మంది పోలీసులతో భద్రతా ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. స్టేడియం పరిసరాల్లో 408 సీసీ కెమెరాలు, 2 డ్రోన్లతో సెక్యూరిటీ ఏర్పాటు చేశారు. మహిళల సేఫ్టీ కోసం షీటీమ్స్ నియమించారు. ప్రేక్షకుల రాకపోకలకు ఇబ్బందులు లేకుండా గ్రేటర్ RTC 60 స్పెషల్ బస్సులు ఏర్పాటు చేసింది.

More in Sports