ఉప్పల్లో టీమిండియా ఫైట్.. సిరీస్పై కన్ను!

హైదరాబాద్లో క్రికెట్ ఫీవర్ మొదలైంది! భారత్–వెస్టిండీస్ మధ్య నాలుగో టీ20కి ఉప్పల్ స్టేడియం రెడీ అయింది. ఇప్పటికే 2-1తో ఆధిక్యంలో ఉన్న టీమిండియా మరో విజయం సాధిస్తే సిరీస్ సొంతం చేసుకుంటుంది. అటు సిరీస్ ఆశలు సజీవంగా ఉంచుకోవాలంటే విండీస్కు గెలుపు తప్పనిసరి. బ్యాటర్లకు అనుకూలించే పిచ్పై అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్ భారీ షాట్లతో చెలరేగుతారా? హోప్ సేన భారత్కు షాక్ ఇస్తుందా? అన్నది ఆసక్తికరంగా మారింది. ఈరోజు రాత్రి 7 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది.



