← Back to news

విద్యే విముక్తి మార్గం - జ్యోతిబా ఫూలేకి నివాళులు

By aravinda nyayapati· 11 Apr 2026· Telugu Report· Hyderabad
విద్యే విముక్తి మార్గం - జ్యోతిబా ఫూలేకి నివాళులు

విద్య లేకపోతే జ్ఞానం నశిస్తుంది.. జ్ఞానం లేకపోతే నైతికత పోతుంది.. నైతికత లేకపోతే అభివృద్ధి ఆగిపోతుంది.. అభివృద్ధి లేకపోతే సంపద ఉండదు.. సంపద లేకపోతే దళితులు అణగారిన వర్గాలు నాశనమైపోతారు. ఒక్క విద్య లేకపోవడం వల్లే ఇన్ని అనర్థాలు జరుగుతాయి. అన్న నినాదంతో సమాజంలో చైతన్యం రగిలించిన సామాజిక విప్లవకారుడు మహాత్మా జ్యోతిబా ఫూలే. ఇవాళ ఆయన జయంతి. మహారాష్ట్రలో పుణెలో 1827 ఏప్రిల్ 11న జన్మించారు. ముఖ్యంగా మహిళా విద్య కోసం తన జీవితాన్ని అంకితం చేసిన ధన్యజీవి ఫూలే. బ్రాహ్మణులే చదువుకోవాలన్న ఆధిపత్య ధోరణిపై తిరుగుబాటు చేసి 1848లోనే దేశంలోనే మొదటి బాలికల పాఠశాలను ప్రారంభించారు. భార్య సావిత్రిబాయి ఫూలేను విద్యావంతురాలిని చేశారు. ఆ మహనీయునికి తెలుగు రిపోర్ట్ ఘన నివాళులర్పిస్తోంది.

More in Motivational

ఒక్క నెగెటివ్ కామెంట్.. వంద ప్రశంసలపై ఎందుకు గెలుస్తుంది?
Motivational· 2d ago

ఒక్క నెగెటివ్ కామెంట్.. వంద ప్రశంసలపై ఎందుకు గెలుస్తుంది?

వందమంది మనల్ని మెచ్చుకున్నా.. ఒక్కరు “బాగా చేయలేదు” అంటే ఆ మాటే రోజంతా మన తలలో తిరుగుతుంది. ఇది మనలో ఏదో లోపం ఉందని కాదు.. మెదడు నెగెటివ్ విషయాలకు ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చేలా పనిచేయడమే కారణం. ప్రమాదాలు, విమర్శలు, తిరస్కరణలు గుర్తుపెట్టుకోవడం మనుగడకు ఉపయోగపడేది. అందుకే మంచి అనుభవాల కంటే చెడు మాటలు ఎక్కువగా గుర్తుండిపోతాయి. అయితే ప్రతి కామెంట్ నిజం కాదు. ఒక్కరి అభిప్రాయాన్ని మన విలువకు కొలమానంగా మార్చుకుంటే.. వంద నిజమైన ప్రశంసల విలువను మనమే తగ్గించినట్టే. అది కేవలం ఒక వ్యక్తి అభిప్రాయం మాత్రమే.