← Back to news

రోడ్డు పక్కన పకోడీలు తింటే అంతేనా!

By sahani· 29 Jun 2026· kaki

కాకినాడ జిల్లా దుగ్గుదుర్రు గ్రామంలో దారుణం జరిగింది. రోడ్డు పక్కన ఉన్న ఒక బండి దగ్గర కొన్న పకోడీలు తిని ఒకేసారి 50 మంది తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. పకోడీలు తిన్న కొద్దిసేపటికే వాంతులు, కడుపునొప్పితో జనాలు ఇబ్బంది పడ్డారు. బాధితులందరినీ వెంటనే కాకినాడ లోకల్ హాస్పిటల్‌కు తరలించి ట్రీట్‌మెంట్ అందిస్తున్నారు. ఫుడ్ పాయిజన్ వల్లే ఇలా జరిగిందని డాక్టర్లు చెప్తున్నారు. ఈ ఇన్సిడెంట్‌తో ఆ ఏరియాలో ఒక్కసారిగా టెన్షన్ వాతావరణం నెలకొంది.

More in News