← Back to news

కుక్క నాకడంతో చిన్నారి మృతి

By Lokesh· 52m ago

AP: గుంటూరులో సోహాన్‌ రుద్రాన్ష్‌ అనే బాలుడు రేబీస్‌తో మృతి చెందాడు. 15 రోజుల క్రితం ఇంటి బయట ఆడుకుంటూ కిందపడటంతో ముఖంపై గాయం అయింది. అదే సమయంలో ఓ వీధి కుక్క ఆ గాయాన్ని నాకింది. కుక్క కరవకపోవడంతో కుటుంబసభ్యులు పట్టించుకోలేదు. కొన్ని రోజుల తర్వాత నీళ్లంటే భయం, ఎక్కిళ్ళు వంటి రేబిస్ లక్షణాలు కనిపించడంతో ఆస్పత్రికి తీసుకెళ్లారు. చికిత్స పొందుతూ బాలుడు మృతి చెందాడు.

More in AP