← Back to news

ఇలాంటి రెస్ట్ కూడా అవసరమే

By BK· 7 Aug 2026
ఇలాంటి రెస్ట్ కూడా అవసరమే

హిప్ బోన్ గాయం నుంచి కోలుకుంటున్న నటి రష్మిక డైలీ రొటీన్ నెమ్మదిగా, ప్రశాంతంగా గడుపుతున్నారు. దీనిపై సోషల్ మీడియాలో స్పందిస్తూ, రికవరీ టైమ్‌లో తగినంత విశ్రాంతి తీసుకుంటూ, పుస్తకాలు చదవడం, పజిల్స్ పూర్తి చేయడం, నచ్చిన షోలు చూడటం చాలా బాగుందని చెప్పారు. అలారమ్‌లతో పనిలేకుండా, ప్రశాంతంగా నిద్రలేచి తన పెట్ డాగ్ 'ఔరా'తో ఆడుకోవడం సంతోషంగా ఉందన్నారు. జీవితంలో అప్పుడప్పుడు ప్రశాంతంగా సమయాన్ని గడపడం ఎంతో మేలు చేస్తుందని రష్మిక అన్నారు.

More in Cinema