← Back to news

సికింద్రాబాద్‌లో ఫైర్ యాక్సిడెంట్!

By sahani· 25 Jun 2026· X· Sikindrabad
సికింద్రాబాద్‌లో ఫైర్ యాక్సిడెంట్!

సికింద్రాబాద్‌లో గురువారం ఒక భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఫేమస్ స్వప్నలోక్ కాంప్లెక్స్ పక్కనే ఉన్న సూర్య కిరణ్ బిల్డింగ్ ఫస్ట్ ఫ్లోర్‌లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. బిల్డింగ్ నుండి దట్టమైన పొగ, మంటలు రావడంతో చుట్టుపక్కల జనాలు భయంతో పరుగులు తీశారు. సమాచారం అందిన వెంటనే ఫైర్ సిబ్బంది స్పాట్‌కి చేరుకుని మంటలను కంట్రోల్ చేశారు. బిల్డింగ్‌లో ఉన్న వాళ్ళను అధికారులు సేఫ్‌గా బయటకు తీసుకొచ్చారు. షార్ట్ సర్క్యూట్ వల్లే ఈ ప్రమాదం జరిగి ఉంటుందని డౌట్ పడుతున్నారు. గతంలో స్వప్నలోక్‌లో కూడా పెద్ద ఫైర్ యాక్సిడెంట్ జరిగిన సంగతి తెలిసిందే.

More in News