← Back to news

వృద్ధురాలి బండి సీజ్‌ వీడియోపై విమర్శలు

By Lokesh· 4d ago· X

రాజస్థాన్ రాష్ట్రం జైపూర్‌లో ఓ వృద్ధురాలు కొబ్బరి బొండాలు అమ్ముకుంటూ జీవనం సాగిస్తోంది. మున్సిపల్‌ సిబ్బంది ఆమె బండిని తొలగించే సమయంలో, వాళ్ల కాళ్లు పట్టుకుని వేడుకుంటున్న వీడియో SMలో వైరల్‌గా మారింది. ఈ దృశ్యాలు నెటిజన్లను కలచివేస్తున్నాయి. జీవనాధారమే కోల్పోతున్నానంటూ వేడుకుంటున్న వృద్ధురాలి పరిస్థితిపై కొందరు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆక్రమణల తొలగింపు చర్యలు చేపట్టినా, పేదల పట్ల మానవత్వం చూపించాలంటూ సోషల్‌ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు.

More in Viral