శ్రీరాంసాగర్ నుంచి కాలువలకు నీటి విడుదల

నిజామాబాద్ జిల్లా మెండోర మండలం పోచంపాడులోని శ్రీరాంసాగర్ ప్రాజెక్టులో ఈ ఏడాది సూపర్ ఎలినినో ప్రభావంతో తగినన్ని నీటి నిల్వలు లేవు. అయినా ఆయకట్టు పంటను కాపాడేందుకు ముఖ్యమంత్రి, సాగునీటి శాఖ మంత్రి ఆదేశాల మేరకు ఒక తడి కోసం సాగునీరు ఇచ్చారు. కాకతీయ, సరస్వతి, లక్ష్మీ, వరద కాలువలు, అలీ సాగర్ గుత్ప లిఫ్ట్ పథకాల ద్వారా 9 టీఎంసీలు అక్టోబర్ 10 నుంచి 20 ఉదయం 9:30 వరకు విడుదల చేశారు.


