← Back to news

యూట్యూబ్ చూసి ఇంట్లోనే వైన్ తయారీ!

By sahani· 8 Jul 2026· Hyderabad

మల్కాజ్‌గిరిలో యూట్యూబ్ చూసి ఇంట్లోనే వైన్ తయారు చేస్తూ, ఎక్సైజ్ నిబంధనలకు విరుద్ధంగా అమ్ముతున్న ఒక వృద్ధుడిని DTF అధికారులు అరెస్ట్ చేశారు. ఎలాంటి పర్మిషన్లు లేకుండా అక్రమంగా వైన్ విక్రయాలు జరుపుతున్నట్లు అధికారులకు పక్కా సమాచారం అందింది. దాంతో అలర్ట్ అయిన అధికారులు సడన్‌గా దాడి చేసి, వైన్ బాటిల్స్‌ను సీజ్ చేసి అతని గుట్టురట్టు చేశారు. నిబంధనలు మీరితే కఠిన చర్యలు ఉంటాయని అధికారులు హెచ్చరించారు.

యూట్యూబ్ చూసి ఇంట్లోనే వైన్ తయారీ!

More in News