పవన్ ఫ్యాన్స్ కు క్రేజీ న్యూస్-ఓజీ 2 మూవీ టాక్స్ షురూ.

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ నటించిన ఓజీ మూవీ కి సీక్వెల్ లేదా ప్రీక్వెల్ 2 రాబోతోంది. ఈ దిశగా పవన్ కల్యాణ్ క్రియేటివ్ వర్క్స్ చర్చలు మొదలు పెట్టింది. ఓజీ సినిమా హిట్ అయిన నేపధ్యంలో దానికి సీక్వెల్ వస్తుందన్న వార్తలు గతంలోనే వినిపించాయి. అయితే దర్శకుడు సుజీత్, పవన్ చర్చలు జరుపుతున్న ఫొటోలు ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారాయి. దానిని బట్టి ఓజీ 2 మూవీ షూటింగ్ ఈ ఏడాది నవంబర్ లో మొదలవుతుందం టున్నారు పవన్ కల్యాణ్ క్రేజీ ఫ్యాన్స్.



