CII సదస్సుకు Pawan kalyan

AP: కాకినాడలోని JNTUలో ఈరోజు CII (Confederation of Indian Industry) రీజినల్ సమ్మిట్ జరగనుంది. DCM పవన్ కళ్యాణ్ చీఫ్ గెస్ట్‌గా హాజరుకానున్నారు. మంత్రులు TG భరత్, BC జనార్దన్ రెడ్డితో పాటు పారిశ్రామికవేత్తలు, పరిశ్రమల ప్రతినిధులు పాల్గొననున్నారు. ఉమ్మడి తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో పారిశ్రామిక అభివృద్ధిని వేగవంతం చేయడం, పెట్టుబడులను ఆకర్షించడం ఈ సదస్సు ప్రధాన లక్ష్యం. ప్రభుత్వ రాయితీలు, బ్యాంకు సదుపాయాలు, వ్యాపార అనుమతుల సరళీకరణ, పెట్టుబడి అవకాశాలపై ఇందులో అవగాహన కల్పించనున్నారు.



