పేపర్ కప్పుల్లో టీ, కాఫీ తాగుతున్నారా?☕️ అయితే ఇది మీకోసమే!

మనం రోజూ ఎకో-ఫ్రెండ్లీ అని పేపర్ కప్పుల్లో వేడి వేడి టీ, కాఫీలు తాగేస్తుంటాం. ఈ పేపర్ కప్పులు లీక్ అవ్వకుండా ఉండటానికి లోపల సన్నని ప్లాస్టిక్ లేదా బయోడిగ్రేడబుల్ కోటింగ్ వేస్తారని ఆస్ట్రేలియాలోని క్వీన్స్‌లాండ్ యూనివర్సిటీ రీసెర్చర్లు తెలిపారు. మనం వేడి డ్రింక్స్ పోయగానే ఆ వేడికి లక్షలాది 'మైక్రోప్లాస్టిక్ కణాలు' కరిగి డ్రింక్‌లో కలిసిపోతున్నాయని, నార్మల్ ప్లాస్టిక్ కోటింగ్ కంటే బయోడిగ్రేడబుల్ కప్పుల నుంచే '12 రెట్లు ఎక్కువ' ప్లాస్టిక్ కణాలు విడుదలవుతున్నట్లు తేలింది.



